Chandrababu : ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా.. అప్పటివరకు అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడుతామని ధర్మాసనం పేర్కొంది.
- bheemraj
- Published On : October 20, 2023 / 11:45 AM IST
Chandrababu anticipatory bail Petition (1)
Chandrababu Anticipatory Bail Petition : ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చంద్రబాబు పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్లు వాయిదా వేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నవంబర్ 9వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడుతామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో యధాతథ స్థితి కొనసాగించాలన్న జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం సూచించింది.
Chandrababu : ప్రభుత్వ వైద్య పరీక్షలు, రిపోర్టులపై నమ్మకం లేదు- చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ లూథ్రా
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మొదట నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా, తనకు ఉన్న వ్యక్తిగత ఇబ్బంది రీత్యా నవంబర్ 9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కోరారు. దీంతో నవంబర్ 9 వ తేదీ విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది.
