Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సర్జరీ.. దీర్ఘకాలం జాగ్రత్తలు తీసుకోవాలన్న డాక్టర్లు

వారం నుండి 10 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

  • Published on- April 18, 2026 / 10:36 PM IST

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి సర్జరీ జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పవన్ కల్యాణ్. కొంతకాలంగా ఆరోగ్యపరంగా పవన్ ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. నిర్వహించారు డాక్టర్లు.

రిపోర్టు పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని నిర్ణయించారు. వెంటనే సర్జరీ చేశారు. వారం నుండి 10 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.