Srisailam Iconic Bridge : శ్రీశైలం వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సర్వే.. రాత్రివేళల్లోనూ ప్రయాణించొచ్చు..
Srisailam Iconic Bridge : శ్రీశైలంకు వెళ్లే ఘాట్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా మురో ముందడుగు పడింది.
- Harish Thanniru
- Updated on- November 15, 2026 / 12:27 PM IST
Srisailam Elevated Corridor
Srisailam Iconic Bridge : శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త. శ్రీశైలంకు ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా మరో ముందడుగు పడింది. నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అటవీశాఖ పర్యవేక్షణలో సర్వే ప్రక్రియ చేపట్టారు. ఈ నెలాఖరుకు సర్వే పూర్తికానుంది. ఇప్పటికే శ్రీశైలం, నెక్కంటి అటవీ రేంజ్ పరిధిలో సర్వే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దోర్నాల రేంజ్ పరిధిలో సర్వే నిర్వహిస్తున్నారు.
Also Read : SpaceX : అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతం.. భూమిపై ల్యాండ్ అవ్వకుండానే రాకెట్ క్యాచ్.. వీడియో వైరల్
ఈ ఐకానిక్ బ్రిడ్జి ఘాట్ రోడ్డులో మలుపులు లేకుండా నిర్మాణం చేయనున్నారు. మార్కాపురం జిల్లాలోని పెద్దదోర్నాల గణపతి చెక్‌పోస్టు నుంచి బోడేనాయక్ తండా, చింతల, తుమ్మలబైలు, జంగిల్ సఫారీ మీదుగా శ్రీశైలం శిఖరం వరకు దాదాపు 43 కిలోమీటర్ల మేర ఎలివేటేడ్ కారిడార్ ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే వాహనదారులు రాత్రివేళల్లో కూడా శ్రీశైలంకు చేరుకొనే అవకాశం ఉంటుంది.
శ్రీశైలం పుణ్యక్షేత్రం చేరుకోవాలంటే అటవీ మార్గం నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయి. దీంతో వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా రాత్రి వేళ మల్లన్న సన్నిధికి వాహనాల రాకపోకలు నిషేధం. రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నల్లమల ఘాట్ రోడ్డులో ప్రయాణించేందుకు అనుమతించరు. గత పదేళ్లుగా శ్రీశైలం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ ఘాట్ రోడ్డులో రాత్రి వేళల్లో కూడా భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రం వద్దకు వెళ్లేలా ఎలివేటేడ్ కారిడార్ నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుతం ఆ ప్రక్రియలో వేగం పుంజుకుంది.
హైదరాబాద్ నుంచి మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు మండలం తోకపల్లె వరకు నేషనల్ హైవే 765 ఉంది. ఈ రోడ్డులోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు శ్రీశైలానికి చేరుకుంటారు. తెలంగాణ నుంచి వచ్చే భక్తులు నాగర్‌కర్నూలులోని బ్రహ్మణపల్లి నుంచి శ్రీశైలానికి వస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులు దోర్నాల నుంచి శ్రీశైలానికి పులుల అభయారణ్యం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఈ అభయారణ్యం ఉన్నచోట ఎలివేటేడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు.
