Mussoorie Woman Death : భర్తతో విహారయాత్రకు వెళ్లిన విశాఖ యువతి అనుమానాస్పద మృతి.. ముక్కు నుంచి రక్తం.. ఆ రాత్రి గదిలో ఏం జరిగింది?
Visakhapatnam woman Suspicious death in mussoorie : ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్టణానికి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
- Harish Thanniru
- Updated on- June 16, 2026 / 10:35 PM IST
Visakhapatnam woman Suspicious death in mussoorie
- ముస్సోరీలో విశాఖ యువతి మృతి
- భర్తతో కలిసి విహాయాత్రకు
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Visakhapatnam woman Suspicious death in mussoorie : ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్టణానికి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతురాలిని పి. రాధా గాయత్రి (27)గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. ఢిల్లీలో నివాసం ఉంటున్నారు.
Also Read – Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. హెచ్చరికలు జారీ ..
విశాఖలోని చినముషిడివాడకు చెందిన గాయత్రికి శ్రీచరణ్‌తో గతేడాది నవంబర్ 8న వివాహం జరిగింది. ఇద్దరూ విశాఖపట్టణానికి చెందిన వారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. గాయత్రి గురుగ్రామ్ లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తుండగా.. సౌమ్య శ్రీచరణ్ పూణేలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి తన భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి విహారయాత్ర నిమిత్తం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. జూన్ 13న ఢిల్లీ నుంచి రిషికేష్‌కు చేరుకున్న దంపతులు జూన్ 14న అర్ధరాత్రి తరువాత ముస్సోరీ సమీపంలోని ట్రిపిధార్ ప్రాంతంలో ఉన్న ఓ హోమ్‌స్టేలో రాత్రి 11.30 గంటలకు చెక్‌ఇన్ అయ్యారు. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి వారిద్దరూ మద్యం సేవించి తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయారు.
ఉదయం శ్రీచరణ్ నిద్ర లేచేసరికి గాయత్రి దుస్తులు లేకుండా.. స్పృహ లేకుండా నేలపై పడి ఉండటం కనిపించింది. ఆమె చుట్టూ మూత్రం, ముక్కు నుండి రక్తం కారుతూ ఉందని తెలిపాడు. రూమ్‌లో ఓ మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం సోమవారం ఉదయం ముస్సోరీ పోలీసులకు అందడంతో వారు 108 అంబులెన్స్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌కు చెందిన ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి.. ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష నిమిత్తం డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. గాయత్రి మృతి ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు ముస్సోరికి బయల్దేరి వెళ్లారు.
