ఏపీలో తమిళ నటి రేవతి ఎన్నికల ప్రచారం: ఎవరి తరపునంటే

  • Publish Date - April 3, 2019 / 07:28 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు జాతీయ నేతలంతా కదిలివచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తరపున ప్రముఖ సినీ నటి రేవతి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం నిర్వహించనున్నారు. రేపు, ఎల్లుండి (ఏప్రిల్ 4,5 తేదీల్లో) రేవతి ఏపీలో ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ  రాష్ట్ర హస్తకళల ఛైర్మన్ పాలి ప్రసాద్ తెలిపారు. 

ఏపీలో రేవతి ప్రచార షెడ్యూల్ 

  • 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు నియోజకవర్గంలోని 49వ డివిజన్ లో ప్రచారం 
  • సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెం (రాత్రికి పాలకొల్లులో బస)
  • 5 ఉదయం 9 గంటలకు పాలకొల్లు
  • సాయంత్రం 4 గంటలకు నరసాపురం 

నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు కూడా పాల్గొననున్నారు. అలాగే తెలుగు సినీ హీరో..చంద్రబాబు తమ్ముడి కుమారుడు నారా రోహిత్ కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారని టీడీడీ నేతలు తెలిపారు. 

కాగా తెలుగు సినిమా ప్రముఖులంతా వైసీపీలో జాయిన్ అవ్వటం..మరికొందరు సపోర్ట్ గా నిలిచారు. ఈ క ్రమంలో తమిళనాడు నుంచి వచ్చి సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేయటం విశేషంగా చెప్పుకోవచ్చు. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు భయపడి వారి ఆస్తులను రక్షించుకునేందుకు తెలుగు సినిమా ప్రముఖులంతా జగన్ పార్టీలో చేరుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.