×
Ad

దేశంలోనే ఇంత వరస్ట్ ఏఎస్పీని నేనెక్కడా చూడలేదు.. ఈయన పనికిరాడు: జేసీ ప్రభాకర్ రెడ్డి

"మీ ఇంటి ముందుకు వచ్చి పడుకుని నిరసన తెలిపితే జవాబు లేదు" అని అన్నారు.

JC Prabhakar Reddy: అనంతపురంలోని తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి చదువు ఉంది కానీ తెలివి లేదని అన్నారు.

“ఇలాంటి ఏఎస్పీని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా పనికిరాడు. ఒక్కరోజు కూడా ఖాకీ యూనిఫాంతో నువ్వు బయటికి వచ్చావా? మిల్ట్రీ డ్రెస్ లో తప్ప. రాళ్ల దాడి జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఘర్షణ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చావు.

Also Read: జపాన్‌ మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన సనాయి తకాయిచి.. ఎవరు ఈమె.. అంతగా ఎలా ఎదిగారు?

దేశంలోనే ఇంత వరస్ట్ ఏఎస్పీని నేనెక్కడా చూడలేదు. తాడిపత్రిలో నువ్వు వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గలేదు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు బయటికి రావాలంటే ఎస్ఐ, సీఐ, కానిస్టేబుల్ లేనిది బయటికి రాలేవు.

పోలీస్ వ్యవస్థకే మచ్చ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి. డీఎస్పీ చైతన్య కంటే నువ్వు పనికిరాని వాడివి. మీ ఇంటి ముందుకు వచ్చి పడుకుని నిరసన తెలిపితే జవాబు లేదు” అని అన్నారు.