Kotamreddy Sridhar Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన నిర్ణయం.. నెల్లూరు రూరల్‌లో కొత్త రాజకీయ ప్రయోగం..
Kotamreddy Sridhar Reddy : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించే దిశగా టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
- Harish Thanniru
- Published on- September 21, 2026 / 07:29 AM IST
Kotamreddy Sridhar Reddy
Kotamreddy Sridhar Reddy : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించే దిశగా టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జెన్ జీ (Gen Z) యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నెల్లూరు రూరల్‌లో నాలుగు సీట్లను ప్రత్యేకంగా కేటాయించనున్నట్లు ప్రకటించారు.
Also Read : AP Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. భీకరగాలులు..
ఈ నాలుగు సీట్లకు పోటీచేసే జెన్ జీ యువతకు అవసరమైన కనీస ఎన్నికల ఖర్చును కూడా తానే భరిస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. దీంతో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉన్న యువతకు ఇది ప్రోత్సాహకరమైన నిర్ణయంగా మారింది.
ప్రజలకోసం పనిచేయాలన్న తపన, రాజకీయాలపై ఆసక్తి, ప్రజా సమస్యలపై అవగాహనతోపాటు వాటిపై స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఉన్న యువతకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం రాజకీయ కుటుంబ నేపథ్యం కాకుండా ప్రజలతో మమేకమై పనిచేయాలనే ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
గత కొన్ని రోజులుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్ జీ పేరుతో పెద్ద సంఖ్యలో యువతతో సమావేశాలు నిర్వహిస్తూ వారితో మమేకమవుతున్నారు. యువత అభిప్రాయాలు, వారి ఆలోచనలు, రాజకీయాలపై వారి ఆసక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయాల్లో యువతకు మరింత ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే నాలుగు సీట్లను జెన్‌జీ యువతకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా కొత్త తరానికి రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం కల్పించడంతో పాటు, స్థానిక ప్రజా సమస్యలపై యువతను చురుకుగా భాగస్వాములను చేయాలని కోటంరెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
