ఓటు వేసిన టీడీపీ ఎంపీ కేశినేని 

  • Publish Date - April 11, 2019 / 02:57 AM IST

విజయవాడ : టీడీనీ ఎంపీ కేశినేని నాని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విజయవాడ చెందిన టిడిపి ఎంపీ కేశినేని నాని విజయవాడ సమీపంలోని గుణదలోని సెయింట్ జోసెఫ్ గర్ల్ హైస్కూల్ లో   పోలింగ్ బూత్ లో తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో 3 లక్షల ఓట్లు మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని కేశినేని ధీమా వ్యక్తంచేశారు. 

కాగా ఏపీలో ప్రముఖులు, రాజకీయ నేతలు తమ ఓటుహక్కుని వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు.