టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం.. కారణం ఇదే

కర్నూలు మాజీ మేయర్, టీడీపీ సీనియర్ నేత బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. రాజకీయంగా అందరూ తనను మోసం చేశారని మనస్తాపం చెందిన బంగి అనంతయ్య

  • Publish Date - March 4, 2020 / 05:21 AM IST

కర్నూలు మాజీ మేయర్, టీడీపీ సీనియర్ నేత బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. రాజకీయంగా అందరూ తనను మోసం చేశారని మనస్తాపం చెందిన బంగి అనంతయ్య

కర్నూలు మాజీ మేయర్, టీడీపీ సీనియర్ నేత బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. తన ఇంట్లోనే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బంగి అనంతయ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఆత్యహత్యకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులే కారణం అని కొందరు అంటున్నారు. అదే సమయంలో.. రాజకీయంగా తనను అందరూ మోసం చేశారని, పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే మనస్తాపంతోనే ఆయనీ పని చేశారని మరికొందరు చెబుతున్నారు.

బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. పలువురు నేతలు, కార్యకర్తలు బంగి అనంతయ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీశారు. గతంలో కర్నూలు మేయర్‌గా బంగి అనంతయ్య పనిచేశారు. ప్రజా సమస్యలపై వినూత్న పద్దతుల్లో నిరసనలు తెలపడంలో బంగి ఫేమస్. ఆయన నిరసనలు వైవిధ్యంగా ఉంటాయి.

అర గుండు, అర మీసం కొట్టించుకుంటారు. అర్థ నగ్నంగా వీధుల్లోకి వస్తారు. శరీరానికి రంగులు పూసుకుంటారు. రోడ్డుపై వింత వింత పనులు చేశారు. లేడీ గెటప్ లు వేస్తారు, గాడిద ఎక్కుతారు. రోడ్లపై బిచ్చం ఎత్తుతారు. ఇలా విభిన్న పద్ధతుల్లో, గెటప్పుల్లో నిరసనలు తెలిపి వార్తల్లోకి ఎక్కారు బంగి అనంతయ్య. సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో బంగి అనంతయ్య చురుగ్గా పాల్గొన్నారు.

See Also |  ఆపద్భాందవుడు : జగన్‌కు జీవీఎల్‌కు ఉన్న సంబంధం ఏంటీ?