బాలికను చంపి డ్రమ్ములో కుక్కిన కేసు.. మదనపల్లిలో ఉద్రిక్తత.. యువకుడి అంతుచూస్తామంటున్న కుటుంబ సభ్యులు
చిన్నారి తండ్రితో హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూస్తామని, సహకరించాలని అనిత కోరారు.
- T Venkateshwarlu
- Published On : February 17, 2026 / 05:32 PM IST
- మదనపల్లిలో ఏడేళ్ల బాలిక హత్య
- కులవర్ధన్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్
- చిన్నారి తండ్రికి హోంమంత్రి అనిత ఫోన్
Madanapalle Crime: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల బాలికను ఓ యువకుడు దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్‌లో కుక్కాడు. ఈ ఘటనతో మదనపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది.
చిన్నారి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని, పోలీసులను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు ఆ బాలిక కుటుంబ సభ్యులు. చిన్నారిని చంపిన కులవర్ధన్‌ను తమకు అప్పగించాలని లేదంటే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఫ్రెండ్‌ను చంపేందుకు కన్నింగ్ ప్లాన్.. రూ.కోటి వచ్చిపడుతుందన్న ఆశతో..
నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని, పాప మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి చిన్నారి ఇంటికి చాలామంది ప్రజలు, రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాల నేతలు చేరుకుంటున్నారు. చిన్నారి తండ్రితో హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడారు.
నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూస్తామని, సహకరించాలని అనిత కోరారు. కాసేపట్లో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించే అవకాశం ఉంది. ఇవాళ ఉదయమే నిందితుడు కులవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
