Talliki Vandanam : ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు మీ అకౌంట్‌లో పడలేదా..? వెంటనే ఇలా చేయండి.. ఆలస్యం చేయొద్దు..

Thalliki Vandanam Scheme : ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం డబ్బులు జమ చేసింది.

Thalliki Vandanam Scheme

  • తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల
  • అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ
  • నగదు జమ కాకుంటే ఇలా చేయాలంటూ సూచన

Thalliki Vandanam Scheme : ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం డబ్బులు జమ చేసింది. అర్హులైన వారికి రూ.13వేలు చొప్పున జమ చేసింది. ఈ పథకం కింద ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ 13వేలు చొప్పున నగదు జమ అవుతుంది.

Also Read : Rain Alert : ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. భీకర గాలులు. పిడుగులు పడే చాన్స్..

2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం ద్వారా 67.47లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 42.70లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ. 10,120.78 కోట్లు జమ చేసినట్లు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యారంగంలో సమూల మార్పులు, సంస్కరణలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని, ఈ పథకం అందుకున్న ప్రతి విద్యార్థి బాగా చదువుకుని పైకిరావాలని ఆకాంక్షించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఆర్థిక సాయం చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రెండో సంవత్సరం కూడా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

తల్లికి వందనం పథకం కింద ప్రతీయేటా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండియర్ వరకు చదువుకునే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఈ పథకం కింద కేటాయించగా.. రూ.13వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం, మిగిలిన రూ.2వేలను పాఠశాలల మెయింటెనెన్స్ కోసం ఆయా పాఠశాలలకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే.


రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ నిధులు రూ.13,000 బుధవారం అర్హులైన తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే, సాంకేతిక కారణాలతో మెసేజ్ రాకపోయినా లేదంటే నగదు జమ కాలేదనే అనుమానం ఉన్నా LEAP యాప్‌ ద్వారా ఈ పథకం స్టేటస్‌ చెక్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. లీప్ యాప్‌లోకి వెళ్లి Parent Login ద్వారా తల్లికి వందనం Status ఆప్షన్‌లోకి వెళ్లి డబ్బులు జమ అయ్యాయా లేదో తెలుసుకోవచ్చని ఏపీ విద్యాశాఖ తెలిపింది. అర్హులై ఉండి డబ్బులు రాకపోతే విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించింది.

తల్లికి వందనం పథకంలో అర్హులైన బ్రాహ్మణ విద్యార్థుల కోసం విడుదల చేసిన సొమ్ము పూర్తిగా ఆర్థిక శాఖ ద్వారానే మంజూరైన సాధారణ బడ్జెట్ నిధులేనని, ఇందులో ఒక్క రూపాయి కూడా దేవాదాయ శాఖ నిధులు, ఆలయాల కానుకల నుంచి మళ్లించలేదని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ తెలిపారు. దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు.