×
Ad

అప్పుడు లేవని గొంతు ఇప్పుడు లేస్తోందేం?.. రేణు దేశాయ్ ఫుల్ ఫైర్

లక్షల మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక చనిపోతున్నారని అన్నారు. దాని కోసం ఎవరూ పోరాడడం లేదని, కుక్కలు కరిస్తే మాత్రం పోరాటాలు చేస్తున్నారని చెప్పారు.

  • వీధి కుక్కల బెడద అంటూ పోరాటాలు చేస్తున్నారు
  • దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి
  • వాటి గురించి పోరాడండి

Renu Desai: వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సినీనటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

బుద్ధి ఉంటే ఒక్కసారి అందరూ కుక్కల గురించి ఆలోచించాలని రేణూ దేశాయ్‌ అన్నారు. ప్రతిరోజు తాను కుక్కలను కాపాడుతున్నానని, అంబులెన్సులు వచ్చి తీసుకెళ్తున్నాయని రేణూ దేశాయ్ తెలిపారు. వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నానని చెప్పారు. ‘దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక రకంగా దోమలు కుట్టి కూడా జనం చనిపోతున్నారు. కానీ, కుక్కలు కరిస్తే మాత్రం పెద్ద ఇష్యూ చేస్తున్నారు. అప్పుడెందుకు మాట్లాడరు? ఇప్పుడెందుు నానా యాగీ చేస్తున్నారు?’ అని రేణుదేశాయ్ ఫుల్ ఫైర్ అయ్యారు.

యానిమల్‌ వెల్‌ఫేర్‌లో ఉన్నవారందరికీ ఈ విషయాలన్నీ తెలుసని అన్నారు. ఇప్పటికే కుక్కలు యాక్సిడెంట్లలో ప్రతిరోజు చనిపోతున్నాయని తెలిపారు. బైక్‌, బస్సు, కార్ల యాక్సిడెంట్లలో కాళ్లు/నడుము విరిగిన కుక్కలను తాను రెస్క్యూ చేస్తున్నానని చెప్పారు. “వాహనదారుల వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని కుక్కలు వెళ్లి ఫిర్యాదులు చేయలేవు కదా?” అని అన్నారు.

బుద్ధి ఉంటే కొంచమన్నా ఆలోచించాలని చెప్పారు. అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయ్యాయని అన్నారు. ఇలా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. రోడ్లపై అడ్డదిడ్డంగా వైన్‌ షాపులు పెడుతున్నారని, ఆల్కహాల్ తాగి వచ్చి చాలా మంది చిన్నపిల్లలను కొడుతున్నారని దాని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఆ చిన్న పిల్లల లైఫ్‌కి విలువ లేదా? కుక్క కరిస్తేనే అడుగుతారా? అని అన్నారు.

లక్షల మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక చనిపోతున్నారని అన్నారు. దాని కోసం ఎవరూ పోరాడడం లేదని, కుక్కలు కరిస్తే మాత్రం పోరాటాలు చేస్తున్నారని చెప్పారు.