Suicide : అప్పులబాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

చిత్తూరు జిల్లాల్లో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Updated on- August 26, 2021 / 09:47 AM IST

Suicide (1)

family commit suicide : చిత్తూరు జిల్లాల్లో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్నాయి. అప్పులబాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

పుత్తూరు మండలం రాచపాలెంకు చెందిన దంపతులు.. కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధతో పురుగులమందు తాగి సూసైడ్ చేసుకున్నారు. మృతులు శంకరయ్య (55), గురవమ్మ (45), వినయ్‌ (25)గా గుర్తించారు.

పెద్ద కుమారుడు అప్పులు చేయడంతో మనస్తాపం చెందిన కుటుంబం.. ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు తీసుకోవడం గ్రామంలో విషాదం నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.