Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్.. దర్శనాలు, గదులపై కీలక నిర్ణయం.. త్వరలోనే ఉత్తర్వులు.. ఇక ఏఐ టెక్నాలజీ..

Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల దర్శనాలు, గదులు, ఆర్జిత సేవలకు సంబంధించి అక్రమాలకు చెక్ పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు దళారులకు, ఫేక్ ఆధార్‌లకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala

  • తిరుమలలో అక్రమాలకు చెక్ పెట్టేలా టీటీడీ ప్లాన్
  • ఆధార్ ఫేస్‌ రికగ్నిషన్‌, ఆధార్‌ నిర్ధారణపై ఫోకస్
  • తిరుమలలో భక్తుల భద్రత కోసం AI టెక్నాలజీ
  • అలిపిరి నడక మార్గంలో గగనతల నిఘా

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కొందరు భక్తులు దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోసం దళారులను నమ్మి మోసపోతున్నారు. దళారులను నమ్మొద్దని పలుసార్లు టీటీడీ సూచనలు చేసినా ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : ‘తల్లికి వందనం’ నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఈసారి వారిఖాతాల్లోకే డబ్బులు..

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల దర్శనాలు, గదులు, ఆర్జిత సేవలకు సంబంధించి అక్రమాలకు చెక్ పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు దళారులకు, ఫేక్ ఆధార్‌లకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ ఫేస్ రికగ్నిషన్, ఆధార్ నిర్ధారణపై ఫోకస్ పెట్టింది. యూఐడీఏఐతో ఇప్పటికే చర్చించగా.. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. యూఐడీఏఐ సేవలు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం నుంచి అవరసమైన నోటిఫికేషన్‌ ఇచ్చేలా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

భక్తుల భద్రత కోసం ఏఐ టెక్నాలజీ..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వచ్చే భక్తుల భద్రత కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భద్రతా చర్యల్లో భాగంగా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నామని, భక్తులకు సురక్షిత ప్రయాణం కల్పించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలు, డ్రోన్లు వంటి అత్యాధునిక పరికరాలను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు టీటీడీ తెలిపింది. వీటి ద్వారా జంతువుల కదలికలను ముందుగానే గుర్తించి భక్తులకు ప్రమాదం లేకుండా చర్యలు తీసుకునేలా సహాయపడుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఎలా పనిచేస్తాయంటే?
ఏఐ ఆధారిత కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తూ 350 డిగ్రీల కోణంలో చుట్టుపక్కల పరిస్థితులను గమనించగలుగుతాయి. దాదాపు 400 మీటర్ల దూరంలో ఉన్న కదలికలను కూడా స్పష్టంగా గుర్తించగల సామర్థ్యం ఈ కెమెరాలకు ఉంది. ముఖ్యంగా చిరుత, ఎలుగుబంటి వంటి వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే వాటిని గుర్తించి సమాచారం పంపే విధంగా రూపొందించారు. ఏఐ కెమెరాలు గుర్తించిన సమాచారం వెంటనే తిరుమలలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది. అదే సమయంలో సంబంధిత మొబైల్ యాప్‌కు కూడా అలర్ట్ వెళ్తుంది. కెమెరా దగ్గర ఏర్పాటు చేసిన అలారం సైరన్ స్వయంగా మోగి జంతువులను భయపడెతుంది. ఆ శబ్దంతో జంతువులు అడవిలోకి వెళ్లిపోతాయని అధికారులు చెప్పారు. ఇదే సమయంలో టీటీడీ సిబ్బంది అప్రమత్తమై.. అవసరమైతే భక్తులను సురక్షిత ప్రాంతాలకు మళ్లించే చర్యలు చేపడతారు.