Tirumala : తిరుమల వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో నో ఎంట్రీ..! భక్తులకు టీటీడీ చైర్మన్ కీలక సూచన..

Tirumala : కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనంకోసం తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది.

Tirumala : కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనంకోసం తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి గరుడసేవ నిర్వహించనున్నారు. దీంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 15వ తేదీ ఉదయం 9గంటల నుంచి అక్టోబర్ 17వ తేదీ ఉదయం 6గంటల వరకు రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు.

Also Read : Gold Rates Today : పండుగ వేళ బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు ఢమాల్.. రూ.5వేలు తగ్గిన వెండి.. ఏపీ, తెలంగాణలో లేటెస్ట్ రేట్లు ఇవే..!

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే, వేంకటేశ్వరస్వామివారికి అత్యంత ప్రియమైన గరుడసేవను శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్నారు. గరుడసేవకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ పాలకమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రెండు ఘాట్‌రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తూ కీలక ప్రకటన చేశారు.

టీటీడీ తీసుకున్న నిర్ణయానికి భక్తులందరూ సహకరించాలని, ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ‘ఎక్స్’ వేదికగా కోరారు. అదేవిధంగా గరుడసేవకు వచ్చే భక్తులు తిరుమలలో పరిమిత పార్కింగ్ వసతిని దృష్టిలో ఉంచుకుని, తిరుపతిలో నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను నిలిపి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణానికి పోలీసు, రవాణాశాఖ సూచనలను పాటించాలన్నారు.