తాడేపల్లిగూడెంలో జనసేనకు మద్దతు తెలిపిన సినీహీరో సుమన్
రాజకీయ నాయకులు కులాలను వెనకేసుకొని కుల నాయకులవలే ముద్రపడేటట్లు వ్యవహరించడం మంచిది కాదని సుమన్ అభిప్రాయ పడ్డారు.
- Harishth Thanniru
- Published On : March 24, 2024 / 12:06 PM IST
Actor Suman
Actor Suman : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నివాసంకు వెళ్లిన సుమన్.. నియోజకవర్గం రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. రాజకీయాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అభివృద్ధి చేసే నాయకులను ఎంచుకొని వారికి ఓటు వేయాలని, తద్వారా తమ ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
Also Read : Devineni Uma Maheswara Rao : టీడీపీ చరిత్రలోనే తొలిసారి.. దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి?
రాజకీయ నాయకులు కులాలను వెనకేసుకొని కుల నాయకులవలే ముద్రపడేటట్లు వ్యవహరించడం మంచిది కాదని సుమన్ అభిప్రాయ పడ్డారు. రాజకీయాల్లో కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించాలని, అప్పుడే అన్నివర్గాల ప్రజల మెప్పును పొందొచ్చని అన్నారు. తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సుమన్ అన్నారు. బొల్లిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తాకలిగిన నేత అని, నియోకవర్గ ప్రజలు ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని సుమన్ కోరారు. తెలంగాణ రాజకీయాలపైన సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి బాగానే చేశారని, అయినా ఓటమి చెందారని సుమన్ అన్నారు.
