Srisailam : శ్రీశైలం సత్రంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Srisailam Five Members Died : శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వడియరాజుల సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

Srisailam

Srisailam : శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వడియరాజుల సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులంతా సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని బత్తుపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సత్రంలో నమోదు చేసుకున్న వివరాల ప్రకారం.. మృతుల పేర్లు మల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, సుధాకర్, మణికంఠగా పోలీసులు గుర్తించారు.

Also Read : AE Nookaraju Family Case : సాధిక్‌ఖాన్‌ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపి.. గడ్డం తీసేసి..

శ్రీశైలంలో వడ్డెర సత్రంలో రూమ్ నెం.12లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఇద్దరు పురుషులు మృతి చెందగా.. స్నానాల గదిలో ఉరేసుకొని ముగ్గురు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్రంలోని గది నుంచి దుర్వాసన వస్తుండటంతో నిర్వాహకులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వండంతో.. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. దాదాపు నెల రోజుల నుంచి వీరంతా వడ్డెర సత్రంలో బస చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరంతా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు కీలక విషయాలను వెల్లడించారు. గత నెల 28న సుధాకర్ తోపాటు ఆయన ముగ్గురు తోబుట్టువులు, మేనల్లుడు శ్రీశైలం వచ్చారని తెలిపారు. రోజుకు రూ.800 అద్దె చెల్లిస్తూ వడ్డెర సత్రం గదిలో ఉంటున్నారని.. ఎక్కువ రోజులు సత్రంలో ఉండకూడదని చెప్పినా.. అనారోగ్య కారణాలు చెబుతూ సత్రంలో ఉంటున్నారని తెలిపారు. సుధాకర్ కు ఇంకా వివాహం కాలేదు.. ఇద్దరు చెల్లెళ్లకు పెండ్లి జరిగినా వారు భర్తల నుండి విడిపోయి సుధాకర్ వద్దనే ఉంటున్నారు. అయితే, వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని డీఎస్పీ తెలిపారు. మృతుల బంధువులకు విషయాన్ని తెలియజేశామని.. మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Also Read : Elkathurthi Woman Killed Case : కారు డిక్కీలో మహిళ మృతదేహం.. వీడిన మిస్టరీ.. కూతురి ప్రియుడితో కలిసి తండ్రి ప్లాన్..!

గమనిక : (ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)