Ap : మహిళా ఎస్సై ఆత్మహత్య
శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరాల్సిన ట్రైనీ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది
- kunduru Vinod
- Published On : August 29, 2021 / 12:18 PM IST
Ap
Ap : విజయనగరం జిల్లాలో ట్రైనీ ఎస్సై కె. భవాని ఆత్మహత్య చేసుకుంది. పోలీస్ ట్రైనింగ్ హాస్టల్ రూమ్ లో ఉరివేసుకొని చనిపోయింది. ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆదివారం భవాని సొంత జిల్లాకు వెల్లాసి ఉందని అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
2018 బ్యాచ్ కి చెందిన కె. భవాని, రాజోలులో ట్రైనీ ఎస్సై పనిచేశారు. తాజగా ఆమెకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పీఎస్ లో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టేందుకు వారం ముందు విజయనగరం ట్రైనింగ్ స్టేషన్ లో శిక్షణ నిమిత్తం ఉంచారు.
ఈ నేపథ్యంలోనే భవాని ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భవాని మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెం గ్రామం. ఇక ఈమె ఆత్మహత్యకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
