TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్.. తిరుమలలో నకిలీ దందా.. భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన
నకిలీ వెబ్ సైట్స్ నుంచి అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించిన టీటీడీ(TTD) బోర్డు.
- V Santhosh Kumar
- Published On : February 26, 2026 / 02:43 PM IST
TTD board advises devotees to be vigilant about fake websites
- శ్రీవారి పేరిట నకిలీ వెబ్ సైట్స్
- ఆన్లైన్ ప్రెమెంట్స్ ద్వారా భక్తుల నుంచి డబ్బు వసూలు
- అప్రమత్తంగా ఉండాలంటూ సూచించిన టీటీడీ
TTD; తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బోల్డ్ హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వెబ్‌సైట్ల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని సూచించింది. కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్స్ చేసుకోవాలని భక్తులను కోరింది. దర్శనాల విషయంలో, వసతి గదుల విషయంలో నకిలీ వెబ్ సైట్స్ భక్తులను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Hyderabad: హైదరాబాద్ లో తీవ్ర విషాదం.. ఆత్మహత్య చేసుకున్న 12 ఏళ్ళ బాలుడు
ఇటీవల కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో ఉన్న వెబ్ సైట్ వల్ల మోసపోయాడు. ఈ ఘటనపై సదరు వ్యక్తి ఫిర్యాదు కూడా చేశారు. దాంతో, అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ విభాగం ఈమేరకు సమగ్ర విచారణ చేపట్టింది. ఈ విచారణలో తిరుమల ఆలయ ఫోటోలు, టీటీడీ(TTD) పేరును అనధికారికంగా వినియోగిస్తూ కొంతమంది నకిలీ వెబ్‌సైట్లు రూపొందించినట్టు గుర్తించారు.
అలాగే ఈ నకిలీ వెబ్ సైట్స్ క్రియేట్ చేసి భక్తుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో డబ్బులు డబ్బులు దోచుకుంటున్నట్టు తెలియడంతో నకిలీ వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ ఐటీ విభాగం. అలాగే, టీటీడీ, దేవాలయ ఫోటోలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్ సైట్లపై కాపీరైట్ కేసులు కూడా నమోదు చేసింది.
