TTD VIP Break Darshan: తిరుమల భక్తులకు అలర్ట్.. ఈ 9 రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TTD VIP Break Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక అలర్ట్ జారీ చేసింది.

TTD Cancels Tirumala VIP Break Darshan

  • తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనాలు రద్దు
  • జులై నుండి సెప్టెంబర్ వరకు వర్తింపు
  • భక్తులు ప్రయాణ ప్రణాళికలు మార్చుకోవాలి

TTD VIP Break Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ జారీ చేసింది. రాబోయే జులై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య తిరుమలలో జరిగే వివిధ పండుగలు, విశేష ఉత్సవాల నేపథ్యంలో.. పలు ప్రత్యేక తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల సాధారణ భక్తులకు దర్శన సమయం కలిసిరానుంది. ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మినహా, మిగిలిన ఎవరి సిఫార్సు లేఖలనూ ఆయా తేదీలకు ముందురోజు స్వీకరించబోమని బోర్డు స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Read Also – Bhuma Akhila Priya: నీ ఇంటికొచ్చి మరీ తేలుస్తా.. ముదిరిన భూమా వర్సెస్ గంగుల వార్.. ఆళ్లగడ్డలో హైటెన్షన్

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయిన తేదీలు – కారణాలు:

  • జులై 14: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  • జులై 17: ఆణివార ఆస్థానం
  • జులై 19: శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద
  • జులై 29: జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం
  • ఆగస్టు 22: పవిత్రోత్సవాలకు అంకురార్పణ
  • ఆగస్టు 24: పవిత్రోత్సవాల రెండోరోజు (పవిత్రాల సమర్పణ)
  • సెప్టెంబర్ 8: శ్రీవారి బ్రహ్మోత్సవాల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  • సెప్టెంబర్ 14: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • సెప్టెంబర్ 15 నుండి 23 వరకు: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఈ 9 రోజులు బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు అయ్యాయి. కాబట్టి, తిరుమల భక్తులు ఈ తేదీలను చూసుకొని వారివారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాల్సిందిగా టీటీడీ (TTD) సూచించింది.