TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. డిసెంబర్ నెల సర్వదర్శనం టోకెన్లు 27న విడుదల
డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబర్ 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను
- Naveen
- Published On : November 25, 2021 / 07:31 PM IST
Ttd Tickets
TTD : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. స్వామివారిని దర్శించుకుని పులకించిపోతారు. దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తారు. నిత్యం వేలాది శ్రీవారిని దర్శించుకుంటారు. కరోనా నేపథ్యంలో టీటీడీ ఆన్ లైన్ లోనే దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాని టీటీడీ విడుదల చేయనుంది.
Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ఎందుకంటే?
డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబర్ 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను కూడా ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నామని టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం కోసం ముందుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
