Mylavaram Agricultural Market : వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ లో మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్
మైలవరం వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ లో మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. 10టీవీ కథనాలకు మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు స్పందించారు. దీనిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు అందుకు బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు.
- bheemraj
- Published On : January 21, 2023 / 03:26 PM IST
LIQUOR
Mylavaram Agricultural Market : ఎన్ టీఆర్ జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆఫీస్ లో మద్యం సేవించిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. 10టీవీ కథనాలకు మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు స్పందించారు. వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ ను బార్ గా మార్చేశారని దృశ్యాలతో సహా 10 టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు అందుకు బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు.
సిబ్బంది నిర్వాకంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ లో మందు పార్టీ చేసుకున్న బీర్ సాహెబ్, నాగరాజును అధికారులు సస్పండ్ చేశారు. వీరితోపాటు మరికొంతమంది ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఎవరెవరు ఉన్నారన్నదానిపై విచారిస్తున్నారు. విధి నిర్వహణలో అసాంఘిక కార్యకలపాలను ఉపేక్షించబోమని ఏడీఎం కిషోర్ హెచ్చరించారు.
Madhya Pradesh: మద్యం మత్తులో యూనిఫామ్ తీసేసిన పోలీస్… వీడియో వైరల్ కావడంతో సస్పెండ్ చేసిన అధికారులు
నిన్న మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆఫీస్ లో ఉద్యోగులు మద్యం సేవిస్తూ రైతులను ఇబ్బంది పెడతున్నారని 10 టీవీలో కథనం ప్రసారం అయింది. ఈ కథనానికి మైలవరం మార్కెట్ యార్డు అధికారులు స్పదించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో మద్యం సేవిస్తూ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులను ఎట్టకేలకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఈ నిర్వాకంపై ఇప్పటికే మార్కెట్ యార్డు జీడీ శారదారాణి, ఏడీఎం కిషోర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విచారణ చేశారు. ఆఫీస్ గదిలో మద్యం సేవిస్తూ విధులు నిర్వహించిన బీర్ సాహెబ్, నాగరాజును సస్పండ్ చేశారు.
