×
Ad

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్.. మరో రెండు కేసులు

"కేసుకు సంబంధించిన వివరాలు ఇస్తే విచారణకు హాజరు అవుతా. ఇదే విషయాన్ని నోటీసుపై నేను రాసి ఇచ్చాను" అని కాకాణి తెలిపారు.

Kakani Govardhan Reddy (Image Credit To Original Source)

  • చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు!
  • పొదలకూరు పీఎస్‌లో ఓ కేసు నమోదు
  • దర్గామిట్ట పీఎస్‌లో మరో కేసు పైల్

Kakani Govardhan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని పొదలకూరు పీఎస్‌లో ఓ కేసు నమోదైంది. తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో సీఎంను విమర్శించారని దర్గామిట్ట పీఎస్‌లో మరో కేసు నమోదు చేశారు.

నోటీసులు ఇచ్చేందుకు నెల్లూరులోని కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసానికి దర్గామిట్ట పోలీసులు చేరుకున్నారు. అయితే, నోటీసులు తీసుకునేందుకు మొదట కాకాణి నిరాకరించారు. కేసు వివరాలు చెప్పాలని పట్టుబట్టారు. ఏయే సెక్షన్లు నమోదు చేశారో చెప్పాలన్నారు.

Also Read: Kadiyam Srihari : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

చివరకు పోలీసుల నుంచి కాకాణి నోటీసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుతూ… తనకు నోటీసులు ఇచ్చారని, ఇవాళ సాయంత్రమే విచారణకు రావాలని చెప్పారని అన్నారు. తాను సోమిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై విచారణకు రమ్మన్నారని వివరించారు.

“ఏ అంశంలో నేను ఆరోపణలు చేశానో స్పష్టంగా చెప్పాలని అడిగాను. సోమిరెడ్డిపై నేను చాలా ఆరోపణలు చేశాను. ఏ అంశంలో విచారణకు రమ్మన్నారో చెబితే వాటికి సంబంధించిన ఆధారాలు తీసుకువెళతా. ఎఫ్‌ఐఆర్‌లో ఏ అంశం ఉందన్నది స్పష్టత లేదు. విచారణకు రావడానికి నేను సిద్ధమే. కేసుకు సంబంధించిన వివరాలు ఇస్తే విచారణకు హాజరు అవుతా. ఇదే విషయాన్ని నోటీసుపై నేను రాసి ఇచ్చాను” అని తెలిపారు.