UGC: దేశంలో 32 యూనివర్సిటీలు నకిలీవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించింది. ఆ వర్సిటీలు ఇచ్చే డిగ్రీలు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో చేరడానికి చెల్లవని పేర్కొంది.
యూజీసీ నకిలీ యూనివర్సిటీలుగా గుర్తించిన వాటిలో 12 ఢిల్లీలోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 4 ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 2 నకిలీ వర్సిటీలు ఉన్నాయి. ఆయా యూనివర్సిటీల్లో చేరేముందు విద్యార్థులు వాటి గుర్తింపునకు సంబంధించిన అంశాన్ని నిర్ధారించుకోవాలని యూజీసీ సూచించింది.
ఆయా వర్సిటీలకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు లేదని చెప్పింది. యూజీసీ చట్టం ప్రకారం.. ఇటువంటి వర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చట్టపరంగా చెల్లవని వివరించింది.
రాష్ట్రాల వారీగా నకిలీ విశ్వవిద్యాలయాల సంఖ్య..
ఢిల్లీ – 12
ఉత్తరప్రదేశ్ – 4
ఆంధ్రప్రదేశ్ – 2
కర్ణాటక – 2
కేరళ – 2
మహారాష్ట్ర – 2
పుదుచ్చేరి – 2
పశ్చిమ బెంగాల్ – 2
అరుణాచల్ ప్రదేశ్ – 1
హర్యానా – 1
జార్ఖండ్ – 1
రాజస్థాన్ – 1
రాష్ట్రాల వారీగా నకిలీ వర్సిటీల జాబితా (2026 ఫిబ్రవరి నాటికి)
ఆంధ్రప్రదేశ్ (2)
క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, గుంటూరు
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం
అరుణాచల్ ప్రదేశ్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్
ఢిల్లీ
వరల్డ్ పీస్ యూనైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ (WPUNU)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్, ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPHS) రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం
కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్.
ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం
వృత్తి విద్యా విశ్వవిద్యాలయం
ADR-సెంట్రిక్ జురిడికల్ విశ్వవిద్యాలయం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
స్వయం ఉపాధి కోసం విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ
ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం)
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్
మౌంటైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ & టెక్నాలజీ
హరియాణా
మ్యాజిక్, ఆర్ట్ విశ్వవిద్యాలయం, ఫరీదాబాద్
జార్ఖండ్
దక్ష విశ్వవిద్యాలయం (వృత్తి జీవిత నైపుణ్య విద్య), రాంచీ
కర్ణాటక
సర్వ భారతీయ శిక్షా పీఠ్, తుమకూరు
గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ, బెంగళూరు
కేరళ
ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్ (IIUPM), కోజికోడ్
సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం
మహారాష్ట్ర
రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగ్‌పూర్
నేషనల్ బ్యాక్‌వర్డ్ కృషి విద్యాపీఠ్, షోలాపూర్
పుదుచ్చేరి
ఉషా లచ్చుమనన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
రాజస్థాన్
రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్, భివాడి
ఉత్తరప్రదేశ్
గాంధీ హిందీ విద్యాపీఠం, ప్రయాగ్‌రాజ్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్శిటీ), అలీఘర్
భారతీయ శిక్షా పరిషత్, లక్నో
మహామాయ సాంకేతిక విశ్వవిద్యాలయం, నోయిడా
పశ్చిమ బెంగాల్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా