Buddha Venkanna : ఉండవల్లికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముడుపులు ముట్టాయి : బుద్దా వెంకన్న

ఉండవల్లి అరుణ్ కుమార్ కు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అబద్దాలు కట్టి పెట్టాలని హితవు పలికారు.

Buddha Venkanna

Buddha Venkanna – Undavalli Arun Kumar : రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని అన్నారు. ఈ మేరకు ఆదివారం బుద్దా వెంకన్న అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముడుపులు ముట్టాయని ఆరోపించారు.

ఉండవల్లి అరుణ్ కుమార్ కు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అబద్దాలు కట్టి పెట్టాలని హితవు పలికారు. బాలకృష్ణ మీసం మీద చేయి వేస్తే మీకొచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేస్తుండటంతో వైసీపీకి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని పేర్కొన్నారు.

Buddha Venkanna : కొడాలి నానికి పేమెంట్ ఇస్తే మీడియా ముందుకు వస్తాడు.. గంజాయి తాగి చంద్రబాబుపై విమర్శలు : బుద్ధా వెంకన్న

పర్యాటకులకు టూరిజం స్పాట్ లు చూపాల్సిన రోజాకు వివేకా హత్య చేసిన చోటు చూపాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, అంబటి రాంబాబు, రోజా, జోగి రమేష్, కాకాని గోవర్థన్, గుడివాడ అమర్నాథ్ లకు వారి వారి శాఖలపై పరిజ్ఞానం లేదని విమర్శించారు.