Amaravati Central Secretariat : అమరావతికి మోదీ సర్కార్ వరాలు.. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. భారీగా నిధులు..
Amaravati Central Secretariat : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
- Harish Thanniru
- Published on- June 10, 2026 / 04:31 PM IST
AP capital Amaravati
- అమరావతికి మోదీ సర్కార్ వరాలు
- సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- రూ.2534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్, జీపీఆర్ఏ నిర్మాణం
Amaravati Central Secretariat : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే క్రమంలో అమరావతి రాజధానిపై వరాలజల్లు కురిపించింది. రాజధాని అమరావతికి కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. సీపీడబ్ల్యూడీ ప్రతిపాదనలకు అనుకూలంగా రూ.2,534కోట్లతో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్, జీపీఆర్ఏ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read : Vizag Steel Plant : ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ.. మా ప్రభుత్వం వచ్చాక రూ. కోటి పరిహారం ఇచ్చి ఆదుకుంటాం..!
కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌కోసం రూ.1,299.08కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ.1,234.91 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. అమరావతిలో 5.35 ఎకరాల్లో రూ.1,299 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధులు, కార్యాలయాల సమన్వయం మరింత సులభతరం కానుందని అధికారులు తెలిపారు. మరోవైపు.. 17 ఎకరాల్లో కేంద్ర ఉద్యోగుల కోసం గృహ సముదాయాలను నిర్మించనున్నారు. ఈ గృహాల ద్వారా ఉద్యోగులు సౌకర్యవంతమైన నివాసం పొందడం సహా నూతన కొలువులకు మరింత స్ఫూర్తినిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల ప్రాజెక్టుల కోసం ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తి అయింది. మరోవైపు అమరావతిలో ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ అద్దె భవనాల్లో నడుస్తుండగా.. సెట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయితే.. అవన్నీ కూడా సెక్రటేరియల్ కాంప్లెక్స్ భవనంలోకి మారనున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరగనుంది.
