Amit Shah Tour Cancelled: విశాఖలో అమిత్ షా పర్యటన రద్దు.. ప్రభుత్వం తెలిపిన వివరాలు ఇవే!

వైజాగ్ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన అనివార్య కారణాలతో రద్దు(Amit Shah Tour Cancelled) కావడంతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా సదస్సు ప్రారంభమైంది.

Union home minister amit shah visakhapatnam tour cancelled cii summit

Amit Shah Tour Cancelled: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావలసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖపట్నం షెడ్యూల్ చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా రద్దయింది. నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ (CII) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ, అనూహ్యంగా ఆయన పర్యటన రద్దయినట్లు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అధికారిక సమాచారం అందింది. దీంతో సదస్సు షెడ్యూల్‌లో పలు కీలక మార్పులు చేయాల్సి వచ్చింది.

Ponguleti Srinivas Reddy: తెలంగాణ భూ యజమానులకు బిగ్ అప్‌డేట్.. ‘భూదార్’ నంబర్ల కేటాయింపు వేగవంతం.. 125 ఏళ్ల తర్వాత క్షేత్రస్థాయి రీసర్వే

పీయూష్ గోయల్ సమక్షంలో ప్రారంభోత్సవం.. మారిన సమ్మిట్ షెడ్యూల్:

ముందుగా ప్రకటించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం ప్రారంభమయ్యే ఈ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో అమిత్ షా(Amit Shah Tour Cancelled) దాదాపు రెండు గంటల పాటు పాల్గొనడంతో పాటు మధ్యాహ్నం జరగాల్సిన ఉమెన్ డెవలప్‌మెంట్ సమ్మిట్‌ను కూడా ప్రాంరంభించాల్సి ఉంది. అయితే అమిత్ షా రాక రద్దు కావడంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశాఖ సదస్సుకు హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

హోంమంత్రిత్వ సమావేశాల రద్దు.. ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం:

మహిళా సాధికారత సదస్సుతో పాటు హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన పలు కీలక ప్రాంతీయ అంశాలపై కూడా అమిత్ షా సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఈ పర్యటన రద్దు కావడం ఏపీ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకోవాల్సిన కేంద్ర హోంమంత్రి పర్యటన చివరి క్షణంలో ఎందుకు రద్దయిందనే విషయమై భిన్న కథనాలు వినిపిస్తుండగా, నిర్వాహకులు మిగిలిన కార్యక్రమాలను పీయూష్ గోయల్ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నారు.