Varla Ramaiah : మేనల్లుడిగా ఎన్టీఆర్ ఫెయిల్: వర్ల రామయ్య
మేనత్తకు అవమానం జరిగితే సరిగ్గా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వర్ల. నటుడిగా జూ. ఎన్టీఆర్ గొప్పవాడే కానీ ఒక మేనల్లుడిగా విఫలమయ్యాడడంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు.
- kunduru Vinod
- Published On : November 25, 2021 / 12:26 PM IST
Varla Ramaiah (2)
Varla Ramaiah : ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి, భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. గత ఐదు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య దంపతులు విజయవాడలోని తమ నివాసం ముందు నిరసన దీక్షకు దిగారు.
చదవండి : Jr NTR: మాట వ్యక్తిత్వానికి ప్రమాణం.. అసెంబ్లీలో ఘటనపై తారక్!
ముందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి వారు దీక్షలో కూర్చున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు ఈ దీక్ష కొనసాగించనున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన రామయ్య.. అసెంబ్లీలో భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. సభాధ్యక్షుడిగా ఉన్న జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.
చదవండి : AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది ?
ఇక ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు రామయ్య. మేనత్తకు అవమానం జరిగితే సరిగ్గా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వర్ల. నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ గొప్పవాడే కానీ ఒక మేనల్లుడిగా విఫలమయ్యాడడంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీని, కొడాలి నానిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జూ.ఎన్టీఆర్‌కి లేదా ? అని వర్ల ప్రశ్నించారు.
చదవండి : AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది ?
వంశీ, కొడాలి నాని జూ.ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నారని వర్ల రామయ్య అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సొంత మనుషులే చంద్రబాబును అవమానిస్తున్నారని రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబం కంటే నీకు సినిమాలు ముఖ్యమా.. అఖండ సినిమా విడుదల కావాల్సి ఉన్నా బాలయ్య మాట్లాడలేదా ? అంటూ ఎన్టీఆర్‌ని ప్రశ్నించారు వర్ల.
