AP Assembly : అప్పుడు జగన్, ఇప్పుడు బాబు..అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్!

తాను సీఎంగా గెలిచిన తర్వాతే..అసెంబ్లీలో అడుగు పెడుతానంటూ..టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శపథం చేసి వెళ్లిపోయారు. గతంలో జరిగిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

AP Assembly : అప్పుడు జగన్, ఇప్పుడు బాబు..అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్!

Babu And Jagan

Jagan And Chandrababu Naidu : ఏపీ రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను సీఎంగా గెలిచిన తర్వాతే..అసెంబ్లీలో అడుగు పెడుతానంటూ..టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శపథం చేసి వెళ్లిపోయారు. గతంలో జరిగిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అసెంబ్లీలో సేమ్ సీన్స్ రిపీట్ అయ్యాయని, వ్యక్తులు మాత్రమే మారారని అనుకుంటున్నారు. ఇద్దరూ ప్రతిపక్ష నేతల హోదాల్లో అసెంబ్లీని బహిష్కరించారు. అయితే..యాదృచ్చికంగా…ఇద్దరూ 19వ తేదీనే అసెంబ్లీని బహిష్కరిచడం విశేషం. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలను 2015, మార్చి 19వ తేదీన జగన్ బహిష్కరించిన సంగతి తెలిసేందే.

Read More : Chandrababu: సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా!

ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదని జగన్ ఎన్నోసార్లు టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించాలని..వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా తమకు సహకరించడం లేదని పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక లాభం లేదని అనుకుని…2015, మార్చి 19వ తేదీన జగన్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను తాను తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నానని, అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి..మహా పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 67 మంది ఎమ్మెల్యేలతో సీఎం హోదాలో జగన్ 2014లో అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Read More : Heavy Rains in Tirupaty: తిరుచానూరులో కుప్పకూలిన ఇల్లు

గతంలో జగన్ చేసిన ఆరోపణలనే ప్రస్తుతం బాబు కూడా ప్రస్తావిస్తున్నారు. వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారని, ప్రతిపక్షాన్ని ఘోరంగా అవమానిస్తున్నారంటూ బాబు అగ్గిలమీదగుగ్గిలమవుతున్నారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ..వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పలుమార్లు బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే…అనూహ్యంగా బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్యను అవమానించేలా వైసీపీ సభ్యులు వ్యవహరించారనే ఆగ్రహంతో 2021, నవంబర్ 19వ తేదీన చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బహిష్కరించారు. తిరిగి తాను ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలో అడుగుపెడుతానంటూ..శపథం చేసి మరీ వెళ్లిపోయారు. గతంలో జరిగిన సీన్స్ మళ్లీ రిపీట్ అవుతున్నాయంటూ..పలువురు కామెంట్స్ చేస్తున్నారు.