Milk Price Hike : సామాన్యుడిపై మరో భారం.. పెరిగిన విజయ పాల ధర.. నేటి నుంచే అమలు

Milk Price Hike : సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. పాల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

Vijaya and sangam dairy increase milk price rs 2 per liter apply from 2026 april in andhra pradesh

Milk Price Hike : ఇప్పటికే గ్యాస్ కొరతతో.. బ్లాక్ మార్కెట్ లో పెరిగిన ధరతో సతమతమవతున్న సామాన్యుడి నెత్తిన మరో బండ పడింది. నిత్యవసరాల ధరలు చుక్కలను తాకుతున్న వేళ.. పాల ధరల పెంపు జేబుకు మరింత చిల్లు పెట్టనుంది. విజయ, సంగం డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెరిగాయి. లీటరు మీద రూ.2 పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల ధరల పెంపుకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే కృష్ణా మిల్క్ యూనియన్ సర్వ సభ్య సమావేశం నిర్వహించి.. నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మార్కెట్ లో విజయ, సంగం డెయిరీ పాల ధరలు పెరిగాయి.

పెరిగిన ధరలు నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుండగా.. కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో మాత్రం ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయిని.. అలానే నెలవారీ పాల కార్డు మీద పాలు కొనుగోలు చేసేవారికి కూడా ఏప్రిల్ 9 వరకు పాత ధరలే అమల్లో ఉంటాయని.. ఆ తర్వాత నుంచి కొత్త ధరలు వర్తిస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల సేకరణ, ప్యాకింగ్ సామగ్రి, ఇతరాత్ర ఖర్చులు పెరిగాయని.. అందుకే పాల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈక్రమంలో ప్రస్తుతం ఉన్న ధరకు లీటరు మీదర రూ.2, అర లీటర్ పాలకు రూ.1 చొప్పున పెంచినట్లు వెల్లడించారు.