Vijayasai Reddy: వాళ్ళను ఉరి తీయాల్సిందే.. రావణ్, ప్రకాష్ రాజ్‌ల వెనుక ఉన్నదెవరు?.. విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్

వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

Vijayasai Reddy makes sensational comments on YouTube Ravan and Prakash Raj.

  • విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్
  • హిందూ వ్యతిరేకులకు ఉరిశిక్ష వేయాలి
  • సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి

Vijayasai Reddy: వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్, రావణ్ వంటి వారిని ఉద్దేశిస్తూ ఆయన సంధించిన ప్రశ్నలు, చేసిన విమర్శలు రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీశాయి. హిందూ ధర్మం, భారతీయ సంస్కృతిపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఈ పోస్ట్‌ ద్వారా పిలుపునిచ్చారు.

తగ్గేదే లే.. కొండా సురేఖపై కడియం శ్రీహరి ఫైర్

మతం మారినప్పటికీ కొందరు తమ కులాల పేర్లను వాడుకుంటూ ఆర్థిక, రాజకీయ లబ్ధి పొందుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మన దేవతలపై, హిందూ మతంపై ఎవరు తప్పుడు వ్యాఖ్యలు చేసినా సమాజం బుద్ధి చెప్పాలని, చట్టం ద్వారా వారికి యావజ్జీవ శిక్ష లేదా ఉరిశిక్ష విధించేలా చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ అయిన వైఎస్సార్సీపీ నేరుగా ప్రకాష్ రాజ్, రావణ్ వంటి వారిని సమర్థించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది సనాతన ధర్మంపై, మన దేశంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు.

భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఇలాంటి ఆలోచనలను మతపరమైన ఉగ్రవాదంగా పరిగణించాలని, చట్టపరమైన శిక్షలతో పాటు సమాజం కూడా వీరిని వెలివేయాలని స్పష్టం చేశారు. ఈ దేశద్రోహ, సంఘ విద్రోహ కుట్రలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)కోరారు.