Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై 11 నుంచి దసరా మహోత్సవాలు.. అమ్మవారి అలంకారాలు ఇవే.. ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారంటే?
Kanaka Durga Navaratri Alankarams 2026 : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై అక్టోబర్ 20వ తేదీ మంగళవారంతో ముగియనున్నాయి. ఈ తేదీల్లో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
- Harish Thanniru
- Updated on- October 3, 2026 / 07:56 AM IST
Kanaka Durga Navaratri Alankarams 2026
Kanaka Durga Navaratri Alankarams 2026 : దసరా పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న దేవి ఆలయాల్లో, శక్తి పీఠాల్లో దసరా సంబరాలు అంబరాన్నంటనున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు, శక్తి పీఠాలు ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై అక్టోబర్ 20వ తేదీ మంగళవారంతో ముగియనున్నాయి. ఈ తేదీల్లో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు పదిరోజుల పాటు పది విభిన్న అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. రోజుకో రూపంలో అలంకృతురాలయ్యే జగన్మాతను దర్శించుకొని భక్తులు తరలించనున్నారు.
అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారో చూద్దాం.
♦ అక్టోబర్ 11న తొలిరోజు : శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
♦ అక్టోబరు 12న రెండో రోజు : శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
♦ అక్టోబరు 13న మూడో రోజు : శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
♦ అక్టోబరు 14న నాలుగో రోజు : శ్రీ మహాచండీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
♦ అక్టోబరు 15న ఐదో రోజు : శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
♦ అక్టోబరు 16న ఆరో రోజు (మూలానక్షత్రం) : శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
♦ అక్టోబరు 17న ఏడో రోజు : శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
♦ అక్టోబరు 18న ఎనిమిదో రోజు : దుర్గాష్టమి, శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
♦ అక్టోబరు 19న తొమ్మిదో రోజు : మహర్నవమి, శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
♦ అక్టోబరు 20న చివరి రోజు : విజయదశమి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
♦ దసరా ఉత్సవాల ముగింపు రోజున అంటే అక్టోబరు 20న సాయంత్రం కృష్ణమ్మ ఒడిలో అమ్మవారికి హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు.
♦ కృష్ణా నదిలో విహరించే హంస వాహనంపై దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్నారు.
