వీళ్లేంటీ ? డాక్టర్లు వేసుకున్న డ్రెస్ వేసుకుని..పెట్రోల్ బంక్ లో నిలబడ్డారు. అక్కడేమన్నా ఎవరికన్నా వైద్యం చేస్తున్నారా ? ఇంకేమన్న కారణం ఉందా ? అని ఆలోచిస్తున్నారు కదా..కానీ వీరు డాక్టర్లు కాదు. కానీ వీరు వేసుకున్న డ్రస్ మాత్రం వైద్యులు వేసుకొనేదే. కానీ ఎందుకు వేసుకున్నారు ? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఫీవర్ నెలకొన్న సంగతి తెలిసిందే.
దీంతో ఆయా దేశాలు ఈ వైరస్ నుంచి కాపాడుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. భారతదేశంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికమౌతునే ఉన్నాయి. వైరస్ బారిన పడిన వారిని కాపాడేందుకు ఎంతో మంది డాక్టర్లు ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. కరోనా వైరస్ భయం ఉన్నా..కొంతమంది విధులు నిర్వహించక తప్పడం లేదు. వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు వైద్యులు బాడీ మొత్తం కవర్ అయ్యేలా ఓ సూట్ ధరించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ఆసుపత్రిలో చూసినా ఇలాంటి డ్రెస్ వేసుకున్న డాక్టర్లు కనిపిస్తున్నారు. విజయవాడలోని ఓ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వైద్యులు వేసుకున్న డ్రెస్ సూట్ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రెడ్, ఇతర ప్రాంతాల్లోకి పోలీసులు వెళ్లివస్తుంటారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఉద్యోగులు ఈ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. తల నుంచి కాళ్ల వరకు పూర్తిగా డ్రస్ కవర్ అవుతుంది. మాస్కులు, గ్లౌజులు శుబ్రం చేసుకొనేందుకు శానిటైజర్ ను అందుబాటులో ఉంచారు.