AP Govt Family Card : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. వారందరికీ ఫ్యామిలీ కార్డులు.. ఎందుకంటే?
AP Govt Family Card : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేక ఫ్యామిలీ కార్డు జారీ చేయనుంది

AP Govt Family Card
AP Govt Family Card : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ తరహాలోనే రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ ఫ్యామిలీ కార్డు అందించాలని అధికారులను ఆదేశించారు.
కుటుంబ ప్రయోజన పర్యవేక్షణ వ్యవస్థపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆధార్ తరహాలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ కార్డు అందించాలని, అందులో కుటుంబ సభ్యుల అవసరాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాల వివరాలు పొందుపర్చాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
అయితే, ఉమ్మడి కుటుంబంగా ఉంటే సంక్షేమ పథకాలు రావనే ఆందోళన ప్రజల్లో ఉంది. ఈ విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటే సంక్షేమ పథకాలు రావనే ఆందోళన వద్దు.. అవసరమైతే వాటిని రీడిజైన్ చేస్తామని చెప్పారు.
కుటుంబంలో సభ్యులందరికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని, ప్రభుత్వం అందించే పథకాలన్నీ ఫ్యామిలీ కార్డులో పొందుపర్చాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఆధార్ తరహాలో అన్ని అవసరాలకూ ఉపయోగించుకునేలా ఈ కార్డు రూపొందించాలని సూచించారు.
ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం ఇది.. కుటుంబాల విచ్ఛిన్నమయ్యే పరిస్థితి తప్పించాలనుకుంటున్నామని, కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఫ్యామిలీ కార్డు ఉపయోగపడాలని చంద్రబాబు అన్నారు.
ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా కుటుంబానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల సమాచారం, అవసరమైన సేవలు ఒకే వేదికలో పొందుపరచబడతాయని అధికారులు పేర్కొంటున్నారు.
కుటుంబానికి లభించే ప్రయోజనాలు..
♦ అన్ని ప్రభుత్వ పథకాల వివరాలు ఒకే చోట ఉంటాయి.
♦ సబ్సిడీలు, సంక్షేమ పథకాలు సులభంగా అందుబాటులోకి రావడం.
♦ కుటుంబ సభ్యుల రికార్డులు డిజిటల్ రూపంలో ఉండటం.
♦ భవిష్యత్ పథకాలకు నేరుగా లబ్ధిదారుల ఎంపిక సులభం.