iPhones 16 Series Sale : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పండగ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

iPhones 16 Series Sale : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ మొదలయ్యాయి. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

1/8iPhones 16 Series Sale
iPhones 16 Series Sale : పండుగ సీజన్ మొదలైంది. స్మార్ట్ ఫోన్లపై అమ్మకాలు మొదలయ్యాయి. ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కూడా అధికారికంగా సేల్స్ ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అనేక స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నాయి.
2/8iPhones 16 Series
ఈ సేల్ సమయంలో ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఆపిల్ ఐఫోన్ల ధరలు కూడా భారీగా తగ్గాయి. ఐఫోన్ అభిమానులు కొత్త ఐఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఈ ప్లాట్‌ఫామ్‌ల నుంచి మీకు నచ్చిన ఐఫోన్ మోడల్ కొనేసుకోవచ్చు. అంతేకాదు.. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
3/8iPhone 16
ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌తో సహా ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు భారీ తగ్గింపు ధరకే లభ్యమవుతున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఈ ఐఫోన్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది.
4/8iPhone 16
ఆపిల్ ఐఫోన్ 16పై ఆఫర్లు : ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల, 60Hz OLED డిస్‌ప్లేతో 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ ఫోన్ A18 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్ (ఇతర మోడళ్ల మాదిరిగానే) కలిగి ఉంటుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కలిగి ఉంది.
5/8iPhone 16
ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఐఫోన్ 2x టెలిఫోటోతో 48MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ కలిగి ఉంది. ఆటోఫోకస్ సపోర్ట్‌తో 12MP ట్రూడెప్త్ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఐఫోన్ 16 రూ. 51,999 ధరకు లభిస్తుంది.
6/8iPhone 16 Sale offers
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌‌పై ఆఫర్లు : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ 6.3, 6.9-అంగుళాల ప్రోమోషన్ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలతో 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తాయి. ఈ ఐఫోన్‌లు A18 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతాయి. 64-బిట్ ఆర్కిటెక్చర్, 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది.
7/8iPhone 16 prices
కెమెరా విషయానికి వస్తే.. అదే 48MP ప్రైమరీ షూటర్‌తో వస్తుంది. కానీ, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో లెన్స్‌ కలిగి ఉంటాయి. ఫ్రంట్ సైడ్ వెనిల్లా వేరియంట్ మాదిరిగా అదే 12MP సెల్ఫీ షూటర్‌ కలిగి ఉన్నాయి.
8/8iPhone 16 offer sale
ఐఫోన్ 16 ప్రో ధర రూ. 74,999కు లిస్ట్ అయింది. ఈ ఐఫోన్ రూ. 5వేలు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్‌తో ధర రూ. 69,999కు తగ్గింపు పొందింది. మరోవైపు, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ. 94,999కు లభిస్తుంది. అలాగే రూ. 5వేలు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ప్రస్తుత ఈ ప్రో మ్యాక్స్ ధర రూ. 89,999కు తగ్గింది.