Vijayawada Utsav : వైభవంగా విజయవాడ ఉత్సవ్ ప్రారంభం.. వెంకయ్య నాయుడుపై మంత్రి లోకేశ్ ప్రశంసలు
Vijayawada Utsav : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథులుగా హాజరై విజయవాడ ఉత్సవ్‌ను ప్రారంభించారు.

Vijayawada Utsav
Vijayawada Utsav : విజయవాడ ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథులుగా హాజరై విజయవాడ ఉత్సవ్‌ను ప్రారంభించారు. 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవ్ జరగనుంది.
Also Read: Pawan Kalya : కార్యకర్తకు పెద్ద పదవి.. పవన్ కల్యాణ్ స్ట్రాటజీ అదేనా..?
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. విజయవాడ పేరులోనే విజయం ఉందని, చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యమని అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎనలేని కృషి చేశారని లోకేశ్ కొనియాడారు. జోవోలన్నీ తెలుగులో వస్తున్నాయంటే అది వెంకయ్య నాయుడితోనే సాధ్యమైందని చెప్పారు. ఆయన ఏజ్.. ఆయనకు ఒక నెంబర్ మాత్రమే.. ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంకయ్య నాయుడుతో పోటీ పడలేకపోతున్నామని లోకేశ్ చెప్పుకొచ్చారు. వెంకయ్య నాయుడు మాటలతో, వాదనలతో గెలిచినవారు లేరన్నారు.
మన సంస్కృతి, కళలు తెలియజేయడానికి విజయవాడ ఉత్సవ్ పనిచేస్తుందని లోకేశ్ అన్నారు. 250 కార్యక్రమాలు ఐదు వేదికలపై నిర్వహిస్తున్నాం. మైసూరు ఉత్సవాల గురించి ఇంతవరకు మాట్లాడేవారు.. ఇప్పుడు విజయవాడ ఉత్సవ్ గురించి మాట్లాడతారు. ప్రభుత్వ పరంగా మా సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్నీని అభినందిస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. అనంతరం విజయవాడకు విశిష్ట సేవలు అందించిన పుర ప్రముఖులను వెంకయ్య నాయుడు, లోకేష్ సన్మానించారు.