OnePlus 13 Price Cut : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. వన్‌ప్లస్ 13పై ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్.. ఇలాంటి డీల్ అసలు వదులుకోవద్దు..!

OnePlus 13 Price cut : అమెజాన్ సేల్ మొదలైందోచ్.. ఈ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 13 తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ క్రేజీ డీల్ ఇలా కొనేసుకోండి.

1/6OnePlus 13 Price cut
OnePlus 13 Price cut : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 అధికారికంగా ప్రారంభమైంది. ముందుగా ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఇతర వినియోగదారులు సెప్టెంబర్ 23 నుంచి షాపింగ్ చేయొచ్చు.
2/6OnePlus 13
ఈ ఏడాదిలో సేల్ స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌ల నుంచి టాబ్లెట్‌లు, గేమింగ్, హెడ్‌ఫోన్‌ల వరకు అన్ని గాడ్జెట్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. వన్‌ప్లస్ 13 కూడా భారీ తగ్గింపు ధరతో లభ్యమవుతుంది. లాంచ్ ధర నుంచి అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/6OnePlus 13 Price cut
వన్‌ప్లస్ 13 ధర తగ్గింపు : గత జనవరిలో వన్‌ప్లస్ 13 లాంచ్ అయింది. అయితే, ఇప్పుడు ఈ సేల్ సమయంలో వన్‌ప్లస్ 13 ఫోన్ భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.69,999గా ఉంటే.. ఇప్పుడు కేవలం రూ.61,999కే అందుబాటులో ఉంది.
4/6OnePlus 13
అంతేకాకుండా, అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులు రూ.2,792 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుత ధర రూ.59,207కి తగ్గుతుంది. అంటే మొత్తం రూ.10,792 ఆదా చేయొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ధరపై మరింత తగ్గింపు పొందవచ్చు.
5/6OnePlus 13 Price cut
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వన్‌ప్లస్ 13 ఫోన్ 6.82-అంగుళాల LTPO 4.1 అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. హుడ్ కింద, అడ్రినో 830 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. మీరు గేమింగ్ చేస్తున్నా లేదా మల్టీ టాస్కింగ్ చేస్తున్నా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
6/6Amazon Great Indian Festival 2025
కెమెరాల విషయానికొస్తే.. ఈ వన్‌ప్లస్ ట్రిపుల్ రియర్ సెటప్‌ కలిగి ఉంది. OISతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6000mAh బ్యాటరీ కలిగి ఉంది.