Suryalanka Beach Festival: సూర్యలంక తీరంలో బీచ్ ఫెస్టివల్ వాయిదా.. కారణం ఇదే..
Suryalanka Beach Festival: బాపట్ల జిల్లాలోని సూర్యలంక తీరంలో జరగాల్సిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు

Suryalanka Beach Festival
Suryalanka Beach Festival: బాపట్ల జిల్లాలోని సూర్యలంక తీరంలో జరగాల్సిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో బీచ్ ఫెస్టివల్‌ను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బీచ్ ఫెస్టివల్‌కు ఈనెల 27వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావాల్సి ఉంది. బీచ్ ఫెస్టివల్ వాయిదా పడడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.