ఏపీకి వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాల్లో 4 రోజుల పాటు జోరు వర్షాలు
వేటకు వెళ్లే మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

AP Rains Alert
Weather Updates: ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని చెప్పింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.
ఈనెల 25 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 26వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడి 26వ తేదీకి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరం దాటుతుందని అంచనా వేసింది.
Also Read: ఈ హోండా సెడాన్ కారు ఇప్పుడు రూ.7 లక్షల కంటే తక్కువ ధరకే.. ఏ వేరియంట్ ధర ఎంత తగ్గింది?
వీటి ప్రభావంతో రాగల నాలుగు రోజులు పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వేటకు వెళ్లే మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.