GST Reforms effect: ఈ హోండా సెడాన్ కారు ఇప్పుడు రూ.7 లక్షల కంటే తక్కువ ధరకే.. ఏ వేరియంట్ ధర ఎంత తగ్గింది?
హోండా సెన్సింగ్ సౌకర్యం ఉన్న కార్లలో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కారు మోడల్ "అమేజ్".

Honda Amaze
GST Reforms effect: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణలు అమలు చేస్తుండడంతో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హిసిల్) ధరలను తగ్గించింది. పన్ను తగ్గడంతో ఆ ప్రయోజనాలను తమ కస్టమర్లకు మళ్లించడానికి ఈ మార్పులు చేసింది. పండుగ సీజన్ సమయంలోనే ధరలు తగ్గడంతో కస్టమర్ల దృష్టి వీటిపై పడే అవకాశం ఉంది.
హోండా అమేజ్ కార్లు ఇప్పుడు రూ.10 లక్షల కంటే తక్కువ (ఎక్స్-షోరూం, ఢిల్లీలో) ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలు రూ.6.97 లక్షలు-రూ.9.99 లక్షల మధ్య ఉన్నాయి. కార్ల కొనుగోలుదారులు రూ.65,100 – రూ.1.2 లక్షల వరకు సేవ్ చేసుకోవచ్చు.
ఏ వేరియంట్ ధర ఎంత తగ్గింది?
మోడల్ | వేరియంట్ | పాత ధర (రూ) | కొత్త ధర (రూ) | ధర తగ్గింపు (రూ) |
---|---|---|---|---|
అమేజ్ (2వ జనరేషన్) | S MT | 7,62,800 | 6,97,700 | -65,100 |
అమేజ్ (2వ జనరేషన్) | S CVT | 8,52,600 | 7,79,800 | -72,800 |
అమేజ్ (3వ జనరేషన్) | V MT | 8,09,900 | 7,40,800 | -69,100 |
అమేజ్ (3వ జనరేషన్) | V CVT | 9,34,900 | 8,55,100 | -79,800 |
అమేజ్ (3వ జనరేషన్) | VX MT | 9,19,900 | 8,41,400 | -78,500 |
అమేజ్ (3వ జనరేషన్) | VX CVT | 9,99,900 | 9,14,600 | -85,300 |
అమేజ్ (3వ జనరేషన్) | ZX MT | 9,99,900 | 9,14,600 | -85,300 |
అమేజ్ (3వ జనరేషన్) | ZX CVT | 11,19,900 | 9,99,900 | -1,20,000 |
హోండా సెన్సింగ్ సౌకర్యం ఉన్న కార్లలో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కారు మోడల్ అమేజ్.
అమేజ్ (2వ జనరేషన్) S MT / S CVTలో బేసిక్ ఇన్ఫోటైన్‌మెంట్, స్టాండర్డ్ సేఫ్టీ ఉంటాయి. కానీ ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) లేదు.
అమేజ్ (3వ జనరేషన్) V MT / V CVTలో మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్, కొన్ని హోండా సెన్సింగ్ ఫీచర్లు ఉంటాయి.
అమేజ్ (3వ జనరేషన్) VX MT / VX CVT మరింత సౌకర్యవంతంగా, టెక్ ఫీచర్లతో ఉంటాయి. ADAS (హోండా సెన్సింగ్) ఉంటుంది. టచ్‌స్క్రీన్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సిక్స్ స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటివి ఉంటాయి.
అమేజ్ (3వ జనరేషన్) ZX MT / ZX CVTలో పూర్తి టెక్, సేఫ్టీ ప్యాకేజీ, ADAS, హోండా కనెక్ట్ ద్వారా కనెక్టెడ్ టెక్, పీఎం 2.5 కేబిన్ ఎయిర్ ప్యూరిఫైర్, వైర్‌లెస్ చార్జర్ ఉంటాయి.