వాహనాలపై కులాన్ని సూచించే స్టిక్కర్లు, నినాదాలు ఉండొద్దు.. వీధుల్లో కులాల బోర్డులు ఉండొద్దు.. సోషల్ మీడియాలోనూ..

సోషల్‌ మీడియాలో కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ పోస్ట్ చేసే కంటెంట్‌పై నిఘా ఉంచుతారు.

వాహనాలపై కులాన్ని సూచించే స్టిక్కర్లు, నినాదాలు ఉండొద్దు.. వీధుల్లో కులాల బోర్డులు ఉండొద్దు.. సోషల్ మీడియాలోనూ..

Updated On : September 23, 2025 / 9:53 AM IST

Uttar Pradesh: వాహనాలపై కులాన్ని సూచించే స్టిక్కర్లు, నినాదాలు అంటించుకుని తిరుగుతుంటారు కొందరు. అలాగే, పోలీసు రికార్డులు, పబ్లిక్‌ నోటీసుల్లోనూ పేరు చివర కులం పేరు రాస్తుంటారు. సోషల్ మీడియాలో తమ కులం గురించి గొప్పలు చెప్పుకుంటారు. ఇకపై ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి లేకుండా చేయడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

పోలీసు రికార్డుల్లో కుల ప్రస్తావన ఉంటే అది అభ్యంతరకర పరిణామాలకు దారి తీస్తోంని ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసు రికార్డులు, పబ్లిక్‌ నోటీసుల్లో కుల ప్రస్తావన ఉండొద్దని యూపీ సర్కారు ఆదేశించింది. కులపరమైన వివక్ష లేకుండా చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

Also Read: యాహూ.. గోల్కొండ రోప్‌వే నిర్మాణానికి మరో అడుగు ముందుకు పడిందోచ్‌..

వాహనాలపై కూడా కులాన్ని సూచించే స్టిక్కర్లు, నినాదాలు ఉండొద్దని మోటారు వాహనాల చట్టంలోనూ ఉందని గుర్తు చేసింది. యూపీలోని పోలీస్‌ స్టేషన్లు, జిల్లా యంత్రాంగాలకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. (Uttar Pradesh)

పోలీసు రిజిస్టర్లతో పాటు కేస్‌ మెమోలు, నిందితుల అరెస్ట్‌ డాక్యుమెంట్లు, నోటీస్‌ బోర్డుల్లో ఇకపై కుల ప్రస్తావన ఉండదు. నేరాలకు సంబంధించిన వివరాలను నమోదు చేసే పోర్టల్‌లోనూ కులానికి సంబంధించిన కాలమ్‌ను ఇకపై ఖాళీగా వదిలేస్తారు.

రికార్డుల్లో నిందితుల పేర్ల వద్ద వారి తల్లిదండ్రుల పేర్లను రాస్తారు. ఇక వాహనాలపై కులాన్ని సూచించే స్టిక్కర్లు, నినాదాలు ఉంటే చలాన్లు విధిస్తారు. అంతేకాదు, పట్టణాలతో పాటు గ్రామాల్లో కులాల గురించి ఏర్పాటు చేసే బోర్డులను తొలగించనున్నారు.

రాజకీయాలకు ఉపయోగపడేలా కులం పేరుతో చేసే ర్యాలీలు, పబ్లిక్‌ ఈవెంట్లు కూడా జరపకూడదు. కులాలను గురించి గొప్పగా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌పై నిఘా ఉంచుతారు. కులం పేరిట శత్రుత్వాన్ని ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటారు.