Amazon and Flipkart Sale 2025 : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్స్.. రూ. 10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు మీకోసం.. ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు..!
Amazon and Flipkart Sale 2025 : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా కస్టమర్లు బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, కూపన్ ఆధారిత ఆఫర్లతో పొందవచ్చు.

Amazon and Flipkart Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ మొదలైంది. అతి తక్కువ ధరలో కొత్త ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పండుగ సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసేందుకు అద్భుతమైన అవకాశం. iQOO, Lava, Oppo, Poco, Redmi, Samsung వంటి బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లు రూ. 10వేల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయి. సాధారణ మార్కెట్ ధరల కన్నా చాలా తక్కువ ధరలకే కొనేసుకోవచ్చు. డైరెక్ట్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లతో మీ కొత్త ఫోన్ అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

రూ. 10వేల లోపు స్మార్ట్‌ఫోన్‌లపై టాప్ డీల్స్ : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్ ఆఫర్లతో పాటు అదిరిపోయే డిస్కౌంట్లను పొందవచ్చు. అమెజాన్‌లో SBI డెబిట్, క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదే సమయంలో, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ICICI బ్యాంక్ కార్డులతో చేసిన చెల్లింపులపై 10 శాతం తగ్గింపును అందిస్తోంది. అమెజాన్ సేల్ అన్ని కూపన్ ఆధారిత డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ పూర్తి ధరపై కస్టమర్‌లు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా పొందవచ్చు.

శాంసంగ్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు : శాంసంగ్ గెలాక్సీ M06 : ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 12,499 ఉండగా, అమెజాన్ సేల్ సందర్భంగా కేవలం రూ. 7499 ధర, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8463కి సొంతం చేసుకోవచ్చు. అలాగే, శాంసంగ్ గెలాక్సీ M05 ప్రారంభ ధర రూ. 9,999 ఉండగా ఈ సేల్ సమయంలో అమెజాన్‌లో కేవలం రూ. 6249కే కొనేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ F07 : ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 64GB స్టోరేజ్ ధర రూ. 9,999 నుంచి రూ. 8499కి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ రూ. 6,249 ధరకు కొనేసుకోవచ్చు.

రూ. 10,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లలో పోకో M7 రూ. 6,499, పోకో C71 రూ. 6,299, రియల్‌మి C61 రూ. 6,249, రియల్‌మి P3 లైట్ రూ. 7,499, పోకో C75 రూ. 7,399, ఇన్ఫినిక్స్ హాట్ 60i ధర రూ. 7,999, ఆల్కాటెల్ V3 క్లాసిక్ 5జీ ధర రూ. 6,499, AI+ నోవా ధర రూ. 8,499, వివో T4 లైట్ రూ. 8,999, AI+ పల్స్ రూ. 4,499 ధరకు లభ్యమవుతున్నాయి.

రూ. 10,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లలో పోకో M7 ప్లస్ ప్రారంభ ధర రూ. 13,999 నుంచి రూ. 10,999కి తగ్గింపు పొందింది.

రూ. 10,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లలో ఒప్పో K13x ప్రారంభ ధర రూ. 11,999 నుంచి రూ. 9,499కి తగ్గింది. గత జూన్‌లో ఈ ఒప్పో ఫోన్ రూ. 11,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది.

రెడ్‌మి A4 5G అసలు ధర రూ. 10,999 ఉండగా కేవలం రూ. 7,499కే లభిస్తోంది. రియల్‌మి నార్జో 80 లైట్ ప్రారంభ ధర రూ. 13,999 నుంచి రూ. 8,999 తగ్గింపు పొందింది. లావా స్టార్మ్ ప్లే 5G ధర రూ. 13,499 నుంచి రూ. 8,999 తగ్గింది.

ఐక్యూ Z10 లైట్ 5G ప్రారం ధర రూ. 13,999 నుంచి రూ. 8,999కి తగ్గింది. పోకో M7 ప్లస్ ప్రారంభ ధర రూ. 13,999 నుంచి రూ. 10,999కి తగ్గింపు పొందింది.