Vijayawada Terror Links Case: విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు.. మరో ముగ్గురు అరెస్ట్
విజయవాడ ఉగ్ర లింకుల కేసు రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగాను సంచలనం సృష్టించింది. తీవ్రవాదం వైపు ఎలా ఆకర్షితులు అయ్యారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఉగ్రవాద భావజాలాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారు అని ప్రశ్నించి వివరాలు రాబడుతున్నారు.
- Naveen
- Published On : March 27, 2026 / 07:05 PM IST
Vijayawada Terror Links Case: విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ లోని ఔరంగాబాద్ కు చెందిన అజంతుల్లా ఖాన్, రాజస్తాన్ లోని జోద్ పూర్ కు చెందిన జిషాన్ అబ్దుల్ మజీద్, మహారాష్ట్రలోని నవీ ముంబైకి చెందిన షేక్ ఫైజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి వీరిని విచారిస్తున్నారు.
విజయవాడ ఉగ్ర లింకుల కేసు రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగాను సంచలనం సృష్టించింది. తీవ్రవాదం వైపు ఎలా ఆకర్షితులు అయ్యారు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఉగ్రవాద భావజాలాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారు అని ప్రశ్నించి వివరాలు రాబడుతున్నారు. హైదరాబాద్ చంచల్ గూడలో సైదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు తీవ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని సైదా బేగం చెప్పింది.
తాను నాలుగో తరగతి వరకు చదువుకున్నానని తెలిపింది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఏడేళ్ల కొడుకుతో కలిసి తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆమె వివరించింది. తనను, తన కుమారుడిని చూసుకునేందుకు సోషల్ మీడియాలో వెతుకుతుండగా నలుగురు యువకులు ఆన్ లైన్ లో పరిచయమయ్యారని తెలిపింది. వారు ఫార్వర్డ్ చేసిన పోస్టులనే తాను పోస్టు చేసేదాన్ని అని సైదా బేగం తెలిపింది. తన ఐడీని వారు ఉపయోగించుకునే వారని కేంద్ర నిఘా అధికారులకు తెలిపింది.
పాకిస్తాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మహమ్మద్ డానిష్, మీర్జా సొహైల్ మహమ్మద్, రహంతుల్లా షరీఫ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ యువకులు టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరికి పాక్ హ్యాండ్లర్లు నిధులు సమకూరుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
