Vizianagaram: వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. కారు దిగకుండా అడ్డుకున్న గ్రామస్తులు

విజయనగరం కొండకెంగువ గ్రామస్తులు.. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడిని అడ్డుకున్నారు. ఇళ్ల నిర్మాణాల శంకుస్ధాపనకు వచ్చిన శంబంగిని గ్రామస్తులు చుట్టుముట్టారు.

Vizianagaram: విజయనగరం కొండకెంగువ గ్రామస్తులు.. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడిని అడ్డుకున్నారు. ఇళ్ల నిర్మాణాల శంకుస్ధాపనకు వచ్చిన శంబంగిని గ్రామస్తులు చుట్టుముట్టారు. వైసీపీకి చెందిన వారికే పెన్షన్‌, ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కారు దిగనివ్వకుండా అడ్డుకున్నారు. రామభద్రపురం మండలం, కొండకెంగువలో ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం శంకుస్థాపన చేసేందుకు చిన్న అప్పలనాయుడు వచ్చారు.

అయితే ఎమ్మెల్యేపై ఊరిలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా వైసీపీ కార్యకర్తలకు ఇళ్లు ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు మంజూరు సహా ప్రతీ ప్రభుత్వ పథకాన్ని తమ పార్టీ వారికే ఇస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. తమ ఊరికి వచ్చిన ఎమ్మెల్యేను కారు దిగనివ్వకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే కారు దిగే సమయంలో ఆయనపై ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో ఎమ్మెల్యే కిందపడిపోయారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో.. ఎమ్మెల్యే చిన్నఅప్పలనాయుడుని పోలీసులు అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు.

ట్రెండింగ్ వార్తలు