VIP break darshan cancel : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. అక్టోబర్ 4న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 5న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 6 సా.6 గంటల నుంచి 7 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని టీటీడీ తెలిపింది.
అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
Tirumala : ఇకపై అందరికీ తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం
బ్రహ్మోత్సవాల విశేషాలు
7న ఉదయం ధ్వజారోహణం – సాయంత్రం పెద్దశేష వాహనసేవ
8న ఉదయం చిన్నశేష వాహనసేవ – సాయంత్రం హంస వాహనసేవ
9న ఉదయం సింహవాహన సేవ – సాయంత్రం ముత్యపు పందిరి వాహనసేవ
10న ఉదయం కల్పవృక్ష వాహనసేవ – సాయంత్రం సర్వభూపాల వాహనసేవ
11న ఉదయం మోహినీ అవతారం – సాయంత్రం గరుడ వాహనసేవ
12న ఉదయం హనుమంత వాహనసేవ – సాయంత్రం గజ వాహనసేవ
13న ఉదయం సూర్యప్రభ వాహనసేవ – సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ
14న ఉదయం సర్వభూపాల వాహనసేవ (రథోత్సవంకు బదులు) – సాయంత్రం అశ్వవాహనసేవ
15న ఉదయం పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం – సాయంత్రం ధ్వజారోహణం