Tirumala : ఇకపై అందరికీ తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం

తిరుమల స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభి

Tirumala : ఇకపై అందరికీ తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం

Tirumala

Tirumala : తిరుమల స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభించిన టీటీడీ.. ఇందుకు సంబంధించి టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

PF Transfer Online : మీ అకౌంట్‌ నుంచి డబ్బులు ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండిలా!

ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఆన్‌లైన్‌లోనూ సర్వదర్శనం టోకెన్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు టీటీడీ పాలక మండలి ప్రకటించింది. దీనిపై చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. ఎక్కువ మందికి శ్రీవారి సర్వదర్శనం కల్పించాలని కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వారంలోపు సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.

Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? రీఫండ్ అవుతాయా? ప్రాసెస్ ఇదిగో!

సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శన టోకెన్స్ విడుదల చేస్తామన్నారు. టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నామని.. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ తెలిపింది.

సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది టీటీడీ. రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేస్తోంది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో ఈ టోకెన్లు జారీ చేస్తున్నారు. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పించారు.

కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ ప్రారంభమైనప్పటి నుంచి భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో సర్వదర్శన టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. కేవలం ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను పరిమిత సంఖ్యలో ఇప్పటి వరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ విషయంలో భక్తులు, హిందూ ధార్మిక సంఘాల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు అనుసరిస్తూ చిత్తూరు జిల్లా భక్తులు మాత్రమే సర్వదర్శనం చేసుకునేందుకు వీలుగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. తర్వాత, క్రమంగా అందరికీ సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా, గతంలో నిత్యం 8 వేల సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసేది. అయితే, తాజా టీటీడీ నిర్ణయంతో రోజూ కేవలం 2వేల మంది చిత్తూరు జిల్లా భక్తులు మాత్రమే సర్వదర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంది.