Visakhapatnam Airport : విశాఖ ఎయిర్‌పోర్టు బంద్.. భోగాపురం నుంచి ప్రారంభం.. ఇక్కడి నుంచి బయలుదేరే సర్వీసులివే..
Visakhapatnam Airport : విశాఖపట్టణం విమానాశ్రయం సేవలు ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి.
- Harish Thanniru
- Updated on- August 16, 2026 / 03:03 PM IST
Visakhapatnam Airport Operations Will Be Suspended From Midnight On August 16
Visakhapatnam Airport : విశాఖపట్టణం విమానాశ్రయం సేవలు ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. పౌరవిమానయానశాఖ ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించింది. ఇకనుంచి 30ఏళ్లపాటు విశాఖపట్టణం ఎయిర్ పోర్టు (ఐఎన్ఎస్ డేగ) సివిల్ ఎన్‌క్లేవ్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
Also Read : ODI World Cup 2027 : గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌కు శ్రీకారం.. ఐసీసీ ప్లాన్ ఇదే..
జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ విమానాశ్రయంకు కేవలం భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథులు రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, వీఐపీ ఎయిర్ క్రాప్ట్ లు ఇక్కడి నుంచి నడుస్తాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలు ఇక నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించనున్నాయి.
ఆగస్టు 17వ తేదీ నుంచి విశాఖ విమానాశ్రయంలో విమాన సేవలు బంద్ కానుండటంతో ఆ సర్వీసులన్నింటిని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు మళ్లించనున్నారు. ఇప్పటికే భోగాపురం నుంచి హైదరాబాద్, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, తిరుపతికి ఇండిగో సంస్థ తొలి రోజు 31 సర్వీసులు నడపడానికి ప్రణాళిక రూపొందించింది.
భోగాపురం విమానాశ్రయం నుంచి 17వ తేదీ ఉదయం 8.55 గంటలకు, 10, 40గంటలకు, మధ్యాహ్నం 1గంటకు, సాయంత్రం 4.25గంటలకు, రాత్రి 7.20, 8.40, 9.20గంటలకు హైదరాబాద్ కు విమానాలు బయలుదేరనున్నాయి. అదేవిధంగా భోగాపురం నుంచి ఢిల్లీకి ఉదయం 8.20గంటలకు, రాత్రి 10.45గంటలకు, బెంగళూరుకు మధ్యాహ్నం 2.55 గంటలకు, రాత్రి 9,10గంటలకు విమానాలు బయలుదేరతాయి. ఇక చెన్నైకి మధ్యాహ్నం 12.15, సాయంత్రం 6.35, కోల్‌కతాకు రాత్రి 7.50, ముంబయికి మధ్యాహ్నం 3.05, తిరుపతికి మధ్యాహ్నం 1.50 గంటలకు విమానాలు ప్రారంభమవుతాయి.
