వ్యభిచారం చేయమని భర్త వేధింపులు : దివ్య కేసులో కొత్త ట్విస్టు

  • Publish Date - June 9, 2020 / 12:28 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విశాఖ  దివ్య హత్య కేసులో  పోలీసులు ఇన్వెస్టిగేషన్  స్పీడందుకుంది.  దివ్య హత్య కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు  పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కాగా…. దివ్యకు 2018 లోనే  వీరబాబు అనే వ్యక్తితో వివాహాం  అయ్యిందని.. మూడు నెలలు కాపురం చేశాక వ్యభిచారం చేయాలని భర్త వీరబాబు దివ్యను వేధించేవాడని పోలీసులు గుర్తించారు.  

కాగా…. వీరబాబుతో పాటు దివ్య పిన్ని కాంతవేణి కూడా వ్యభిచారం చేయమని ఒత్తిడి చేయసాగింది. వీరి ఒత్తిడిని తట్టుకోలేని దివ్య విశాఖపట్నంలో వసంత, గీత  వద్దకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే దివ్య పిన్నిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దివ్య బాబాయిని, వీరబాబుని పట్టుకునే పనిలో ఉన్నారు. 

వీరిద్దరిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పట్టుబడ్డ నిందితులను మళ్ళీ విచారించేందుకు  వీలుగా పోలీసు కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్   వేయనున్నట్లు విశాఖ పోలీసు కమీషనర్ ఆర్కే మీనా చెప్పారు.