Kurnool Students Drown: కర్నూలు జిల్లాలో నీటికుంటలో మునిగిన 5వ తరగతి విద్యార్థులు.. ఆరుగురి మృతి
నీటికుంటలో సరదాగా స్నానం చేద్దామని దిగిన విద్యార్థులు ఈత రాకపోవడంతో మునిగి చనిపోయారు.

Kurnool Chigili village pond accident
Kurnool Students Drown: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నీటికుంటలో మునిగి ఆరుగురు 5వ తరగతి విద్యార్థులు మృతి చెందారు. నీటికుంటలో సరదాగా స్నానం చేద్దామని దిగిన విద్యార్థులు ఈత రాకపోవడంతో మునిగి చనిపోయారు.
వర్షాలకు కుంటలో భారీగా వర్షపు నీళ్లు
గ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఏడుగురు చిన్నారులు ఇవాళ గ్రామ శివారులోని నీటి కుంట వద్దకు వెళ్లారు. వారిలో ఆరుగురు ఈతకు దిగి మునిగిపోయారు.
మరో విద్యార్థి ఈ విషయంపై స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికులు అక్కడకు చేరుకుని ఆరుగురు చిన్నారులు మృతదేహాలను వెలికితీశారు.
కాగా, ఆ ప్రాంతంలో వర్షాలకు కుంటలో భారీగా వర్షపు నీళ్లు చేరడంతో లోతు పెరిగింది. (Kurnool Students Drown)
చిగిలి గ్రామాన్ని కుదిపేసిన విషాదం
ఈ విషాద ఘటన, గ్రామ ప్రజల్లో ఆవేదన రేపింది. ఆ చిన్నారుల తల్లిదండ్రుల కన్నీళ్లు ఆగడంలేదు. పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పిల్లల భద్రతపై మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నారుల ప్రాణాలు మన చేతుల్లో ఉన్న బాధ్యతగా భావించి, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.