Viveka murder case
Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం విచారణకు రాగా.. జస్టిస్ సుందరీష్ ధర్మాసనం విచారణ జరిపింది. కింది కోర్టు ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలన్న ధర్మాసనం.. దర్యాప్తునకు అవసరం అని భావిస్తున్న అంశాలకు సంబంధించిన ఆధారాలు, సమాచారాన్ని సీబీఐకి అందజేయమని పిటిషనర్‌కు సూచించింది.
అయితే, వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి చేశామని, కింది కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నామని కోర్టుకు సిబిఐ తెలిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన సందేశాలపై మాత్రమే దర్యాప్తు జరపమని కింది కోర్టు ఆదేశించిందని, ఇతర అంశాల్లో కూడా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ లూత్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇద్దరి మధ్య సందేశాలపై దర్యాప్తును నెల రోజుల్లో పూర్తి చేయాలని కూడా సీబీఐని కిందికోర్టు ఆదేశించిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి సిద్ధార్థ లూత్ర తీసుకెళ్లారు. కింది కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తుని కొనసాగించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ధర్మాసనం సూచించింది. కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అంశాలకు సంబంధించిన సమాచారం, ఆధారాలను సిబిఐకి అందజేసే అవకాశంను వైఎస్ సునీతకు ధర్మాసనం కల్పించింది. దర్యాప్తు ప్రక్రియలో జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని